పెళ్ళి ఆపాలని చూస్తున్న దుగ్గిరాల కుటుంబం.. ప్లాన్ తెలుసుకున్న యామిని!
on Jun 14, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -748 లో..... అపర్ణ, కనకం ఇందిరాదేవి ముగ్గురు కలిసి పెళ్లి ఎలాగైనా ఆపాలని ప్లాన్ చేస్తారు. పంతులు వీక్ పాయింట్ తెలుసు.. మీరు వెళ్లి కనకాంబరం అని పిలుస్తుండండి అని ఇందిరాదేవి వాళ్ళకి కనకం చెప్తుంది. ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు పంతులు దగ్గరికి వెళ్లి.. మిమ్మల్ని కనకాంబరం పిలుస్తుంది.. వెళ్ళండి అని చెప్పగానే పంతులు సిగ్గుపడుతూ వెళ్తాడు.
తీరా చూస్తే అక్కడ కనకం ఉంటుంది. మీరెవరని పంతులు అడుగుతాడు. మీరు మాకు ఒక హెల్ప్ చేయాలి. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని కనకం అనగానే.. కుదరదని పంతులు అంటాడు. ఇందిరాదేవితో పంతులు కోపంగా మాట్లాడుతుంటే.. కనకం ఫొటోస్ తీస్తుంది. మీరు నన్ను బెదిరిస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తానని పంతులిని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఇందిరాదేవి. అంతే కాకుండా కనకాంబరం విషయం కూడా మీ భార్యతో చెప్తామని అనగానే.. పంతులు భయపడి సరే అంటాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వచ్చి.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తాడు. యామిని బ్లాక్ మెయిల్ చేస్తేనే ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు రాజ్ చెప్తాడు. మరొకవైపు రుద్రాణికి యామిని ఫోన్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావని అడుగగా... పక్కనే ఉన్నానని రుద్రాణి అబద్ధం చెప్తుంది.
మరొకవైపు పంతులు గారు ఇందిరాదేవి వాళ్ళందరు కిందకి వస్తారు. పూజకి టైమ్ అవుతుంది అమ్మాయిని తీసుకొని రండీ అని పంతులు అనగానే.. యామిని వస్తుంది. తరువాయి భాగంలో యామిని హారతి ఇస్తుంటే.. దీపం ఆరిపోతుంది. ఇలా జరుగుతుంది పెళ్లి ఆపేయండని అపర్ణ అంటుంది. అవసరం లేదు మళ్ళీ నిశ్చితార్థం పెట్టి ముహూర్తం పెడుదామని పంతులు అనగానే అపర్ణ వాళ్ళు షాక్ అవుతారు. ఇవ్వన్ని నీ ప్లాన్ అని తెలుసని కావ్యతో యామిని అంటుంది. పెళ్లి కంటే ముందు ఆయనకు నేను గుర్తొచ్చిన కూడా పెళ్లి ఆగిపోతుందని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
